23 April, 2026 | 6:39 AM

స్నాతకోత్సవాల్లో నల్లగౌనుకు స్వస్తి

24-08-2024 12:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 23: కళాశాలల్లో, యూనివర్సిటీల్లో, ముఖ్యమైన సంస్థల స్నాతకోత్సవాల్లో కచ్చితంగా కనిపించేది నల్ల గౌను. ముఖ్య అతిథులతోపాటు విద్యార్థులు, పట్టాలు అందుకొనేవారు నల్ల గౌనును ధరించి, తలపై నల్ల టోపీ పెట్టుకొంటారు. ఇకపై ఈ నల్ల గౌను, నల్ల టోపీ కనిపించదు. ఈ రెండు వలసవాద సంస్కృతికి చిహ్నాలని, వెంటనే వీటి వాడకాన్ని రద్దుచేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఎయిమ్స్‌లు సహా అన్ని వైద్య కళాశాలలకు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. వీటి స్థానంలో భారతీయ సంస్కృతిని ప్రతిబింభించేలా యూనిఫాంను రూపొందించాలని సూచించింది.