13-11-2025 12:00:00 AM
మణుగూరు, నవంబర్ 12 (విజయక్రాంతి) : మణుగూరు సింగరేణి ఏరియాలో కంపెనీ స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ క్రీడా పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పి.వి కాలనీ భద్రాద్రి స్టేడియంలో వర్క్ పీపుల్ స్పోరట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ 2025 -26 కు గాను మణుగూరు ఏరియాలో క్రీడా పోటీలను ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ డి. వెంకటరామారావు ముఖ్య అతిథిగా హాజరై, క్రీడా పతకాన్ని ఆవిష్కరించి, టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత, క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఒత్తిడి తట్టుకునే విధానం పెంపొందించు కోవచ్చన్నారు. ఉద్యోగులు తమ నిత్య జీవిత విధుల్లో భాగంగా ప్రతిరోజు 30 నిమిషాలపాటు తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. క్రీడల వల్ల క్రమశిక్షణ ఏర్పడు తుందన్నారు. ప్రతి సంవత్సరం సింగరేణి సంస్థ ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా క్రీడా పోటీలు నిర్వహిస్తుందని తెలిపారు. యువ ఉద్యోగాలు క్రీడలపై దృష్టి సారించి రాణించి ఏరియాకి మంచి పేరు తీసుకు రావాలని ఆకాక్షించారు.
ఈ పోటీల్లో సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల నుండి అనేకమంది ఉద్యోగ క్రీడా కారులు పాల్గొనున్నారు. ఫైనల్ మ్యాచ్ అనంతరం గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేయబడతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ సలగట్ల రమేశ్, ఏరియా ఇంజినీర్ ఆర్. శ్రీనివాస్, ఎస్ ఓ టు జి ఎం శ్రీనివాస చారి, కార్మిక సంఘాల నా యకులు మేకల ఈశ్వర్, వి. కృష్ణం రా జు, సిఎంఓఏఐ ప్రతినిధి రమే శ్ , వంశీ కృష్ణ, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగ క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.