13-11-2025 12:00:00 AM
ఖైరతాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): ఈ నెల 21న తెలంగాణ ముది రాజ్ మహాసభ 11 వార్షికోత్సవ వేడుకల ను ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ము దిరాజ్, ఉపాధ్యక్షులు వెంకట నర్సయ్య మాట్లాడుతూ.. 11వ వార్షికోత్సవంతో పాటు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవా న్ని రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో ముదిరాజ్ జెండా ఎగరవేసి, ర్యాలీలు నిర్వహించి సంబరాలు జరుపుతామన్నారు.
తమ పోరాటాల ఫలితంగా కో కాపేటలో ముదిరాజ్ భవనం కోసం 300 కోట్ల విలువైన ఐదు ఎకరాలు స్థలా న్ని సాధించామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హమి ప్రకారం 42% విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు తమకు కల్పించాలని కోరారు. అలాగే బీసీ-డీలో ఉన్న ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని కోరారు. ముదిరాజ్ సొసైటీ కార్పొ రేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్ల నిధు లు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అధ్యక్షుడు ఉప్పరి నారాయణ, ఉపాధ్యక్షులు బల్ల సత్తయ్య, భద్ర మౌని యాదయ్య, మహిళా అధ్యక్షురాలు ఎం,వరలక్ష్మి పాల్గొన్నారు.