1 July, 2026 | 11:05 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం సరైనది కాదు

17-04-2026 04:10 PM

బోథ్,(విజయక్రాంతి): పార్లమెంట్ వేదికగా బిజెపి ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం సరైనది కాదని సోనాల మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు చౌహాన్ వినోద్ డిసిసి కార్యదర్శి దూలకు పోశెట్టిలు విమర్శించారు. ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుంచుకోవాలన్నారు. ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ అధ్యక్షులు జింగాల భోజన్న మాజీ సర్పంచ్ సోయం బాపూరావు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  సుదర్శన్, రామ్మాయి రాము మునేశ్వర్ సోమన్న భీమ్రావు పాటిల్, సుధీర్ కుమార్, జి బోజరాజు, తదితరులు పాల్గొన్నారు.