17 April, 2026 | 5:43 PM

చలివేంద్రాన్ని ప్రారంభించిన తహసిల్దార్ బసిరుద్దీన్

17-04-2026 04:06 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అలంగిరి మజీద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని శుక్రవారం  స్థానిక తహసీల్దార్ బషీరోద్దీన్ ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో మస్జిద్ అధ్యక్షులు ఏ క్యూ నదీం. ఇమామ్ నసార్ అలీ, మహఫుజ్ అల్లం,  మస్జిద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బషీరోద్దీన్  మాట్లాడుతూ ఈ చలివేంద్రం ద్వారా ప్రతిరోజూ పాదచారులు, ప్రయాణికులు, కార్మికులకు ఉచితంగా చల్లని తాగునీరు అందించడం, మండుతున్న ఎండలో ప్రజలకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుందని  తెలిపారు. అబ్దుల్ హకీం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం, సమాజంలో సానుభూతి, మానవతా భావాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కలీం, రఫీఖ్, మసుద్, జావిద్, ఆసిఫ్ యువకులు, మస్జిద్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ప్రజలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ బసిరుద్దీన్ ఘనంగా సన్మానించారు.