ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
యాదాద్రి భువనగిరి మార్చి 13 ( విజయక్రాంతి ): ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మండలం సైదాపురం, మాసాయిపేట, మల్లాపురం గ్రామాలలో బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గురువారం పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. నీళ్లు లేక ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు.
నాలుగు ఎకరాలు, 5 ఎకరాలు, మూడు ఎకరాలు, కలిగిన చిన్న, సన్నకారు రైతులు వేసిన బోర్లలో భూగర్భ జలాలు ఎండిపోయాయి. నీళ్లు లేక చేతికొచ్చిన పొలాలు కళ్ళముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను నింపుతామని ఎమ్మెల్యే మాట ఇవ్వడంతో నమ్మకంతో రైతులు సాగు చేశారు. ఎమ్మెల్యే చెరువులను నింపకపోవడంతో వరి పొలాలు ఎండిపోతున్నాయని బిజెపి నాయకులు అన్నారు.
గంధ మల్ల రిజర్వాయర్ చెరువు అలానే ఉన్నది, కరువు తాండం చేస్తున్నది, పశువులకు మేత లేక అల్లాడుపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతన్నల బాధలను పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఎండిపోయిన పొలాలకు ఎకరానికి 40 వేలు నష్టపరిహారాన్ని రైతులకు ప్రభుత్వం అందజేయాలని కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి యాదగిరిగుట్ట మండల అధ్యక్షురాలు, గుంటిపల్లి మహేశ్వరి, సత్యం, కిసాన్ మార్చా మండలాధ్యక్షులు నర్సింలు, రచ్చ శ్రేనివాస్,యాదగిరి గుట్ట పట్టణ అధ్యక్షులు ప్రవీణ్,అచ్చయ్య, చంద్రమోహన్,ప్రవీణ్ రెడ్డి, మంగు నర్సింగ్ రావు వదులు నాయకులు పాల్గొన్నారు.
తుంగతుర్తి..
తుంగతుర్తి, జనవరి 13: రైతుల ఎండిపోయిన వరి పైరుకు ఎకరానికి 25 వేల రూపాయలు ప్రభుత్వ నష్టపరివారా అందించాలని కోరుతూ గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో బి ఆర్‌ఎస్ నాయకులు పరిశీలించి నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఎండిపోయిన పంటకు ఎకరాకు 25000నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోతాటికొండ సీతయ్య గుండాగానీ రాములు గౌడ్ గాజుల యాదగిరి గోపగాని రమేష్ దొంగరి శ్రీనివాస్ పల్ల రాములుమట్టిపల్లి వెంకట్ కడారి దాసు బల్లెం ప్రవీణ్ మన్నూరు పోతారాజు మాజీ సర్పంచ్ శేఖర్ ఉప్పుల సైదులు తదితరులు పాల్గొన్నారు
మునుగోడు
మునుగోడు,మార్చి 13 (విజయక్రాంతి): సాగునీరందక పంట ఎండి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు పరిహారం ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యు డు బండ శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కాల్వలపల్లిలో ఎండిన వరి పొలాలను రైతు సంఘం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. కల్వలపల్లి గ్రామంలో 560 రైతులు 160 ఎకరాల్లో పంటనష్టపోయారని తెలిపారు.
కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాగర్ల మల్లేశ్, శివర్ల వీరమల్లు, రమేశ్, మల్లేశ్ , లక్ష్మయ్య, సైదులు, ఎల్లయ్య, రాములు, అంజయ్య, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవడం మేలని మండల వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. గురువారం పులిపలుపులలో ఎండిపోతున్న వరి పొలాలను ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడారు.
బోరుబావులను ఇంకుడు గుంతల సాయం తో రీచార్జ్ చేసుకోవాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం చేయడంతో భూమి లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. విచ్చల విడిగా ఎరువులు, పురుగుల మందులు వాడితే భూమిలో చౌడు పెరుగుతుందన్నారు. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, కూరగాయలు సాగు చేసుకోవాలని చెప్పా రు. బిందు సేద్యం పద్ధతిలో ఆయిల్ పామ్ తోటల పెంపకం మేలని పేర్కొన్నారు. ఏఈఓ నర్సింహ, రైతులు ఉన్నారు.






