25 August, 2026 | 1:00 PM

ఎంజీయూలో వసతుల తనిఖీ

14-03-2025 02:09 AM

క్షేత్రస్థాయిలో పర్యటించిన పరిశీలన కమిటీ

నల్లగొండ, మార్చి 13 (విజయక్రాంతి) : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాన్ని గురువారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పరిశీలన బృందం సభ్యులు ఫ్రొఫెసర్ విద్యాధర్రెడ్డి, బాలకృష్ణ, మృణాళిని,  శోభారాణి పరిశీలించారు. వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ వర్సిటీ స్థితిగతులు, ప్రభుత్వానికి నివేదించిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. రానున్న విద్యాసంవత్సరం నుంచి  ఎల్‌ఎల్బీ, ఎల్‌ఎల్‌ఎం,  బీఈడీ,  ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఏ గవర్నర్స్ అండ్  పబ్లిక్ పాలసీ, ఎంఏ డెవలప్మెంటల్ స్టడీస్, బీఫార్మసీ కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు అధ్యాపకుల నియామకం, కళాశాల భవనాల కోసం ప్రతిపాదన పంపినట్లు తెలిపారు. ఇందుకు 309.65 కోట్లు అవసరమని పేర్కొన్నారు.

అనంతరం పరిశీలన కమిటీ పానగల్ క్యాంపస్, ఇంజినీరింగ్, ఆరట్స్,  సైన్స్ కళాశాలలను, స్పోరట్స్ కాంప్లెక్స్లను పరిశీలించారు. సదుపాయాలన్నింటనీ పరిశీలించి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి, ఉన్నత విద్యా మండలికి  అందంచనున్నట్లు వారు తెలిపారు. పరిశీలన బృందం వెంట రిజిస్ట్రార్ అల్వాల రవి,  ఓఎస్డీ కొప్పుల అంజిరెడ్డి, ఇన్స్స్ట్రక్టర్, డెవలప్మెంట్ డైరెక్టర్ ఆకుల రవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రశాంతి, ప్రిన్సిపాళ్లు ఉన్నారు.