95 ఏండ్ల వయస్సు... పింఛన్ రాకపాయే?
ముగ్గురు కుమారులు మృతి, బిడ్డ వద్ద నివాసం
తుంగతుర్తి, మార్చి 13 : ప్రభుత్వాలు మారుతున్న ,అధికారులు వస్తూ ఉన్న ప్రజాప్రతినిధులు మారుతున్న నా తలరాత మాత్రం మారలేదని ప్రభుత్వ అధికారులు పింఛను మాత్రం ఇస్తలేరని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామానికి చెందిన 95 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధ ఎడ్ల చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగు పల్లి గ్రామానికి చెందిన ఎడ్ల చంద్రమ్మ ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు దీనిలో ఒక కుమారుడు ఉద్యోగి మిగతా ఇరువురు పనిచేస్తూ గడిచిన 10 సంవత్సరాల క్రితం వివిధ సంఘటనలతో ముగ్గురు కుమారులు మరణించారు. ప్రస్తుతం వృద్ధ మహిళ బిడ్డ వద్దనే ఉంటూ తన జీవనాన్ని గడుపుతున్నది. 60 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి పింఛను పొందుతున్నారు.
గతంలో పలుమార్లు పింఛన్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ విఫలమైందని ఆమెరోదించారు. ప్రస్తుతం ఈమె పేరు కనీసం రేషన్ కార్డులో కూడా లేకపోవడం గమనించవలసిన విషయమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించిన మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తాను సహాయం చేస్తానని ముందుకు రావడం అభినందనీయమని గ్రామస్తులన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి, 95 సంవత్సరాల వృద్ధురాలికి పింఛన్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.






