సమానుల మధ్య స్పర్థ ఉన్నతికి సోపానం
ఏవం సమః సమమతి
సందధ్యాత్ .. అనుగృహ్ణీయాద్వా
- కౌటిలీయం: (7.-7)
‘ముడు, సముడైన వారిపై విక్రమించడమో, అనుగ్రహించడమో చేయాలి’ అని అంటాడు ఆచార్య చాణక్య. బలం బలాన్ని గౌరవిస్తుంది. బలవంతుడికే గౌరవం లభి స్తుంది. కయ్యానికైనా, వియ్యానికైనా సమ వుజ్జీలు కావాలనేది నానుడి. సమానస్థా యి వారితో స్పర్థ వ్యక్తి ఉన్నతికి ఉపకరిస్తుంది. వారితో భాగస్వామ్యమూ ప్రగతికి మార్గం చూపుతుంది.
తక్కువస్థాయి వ్యక్తు ల స్నేహం వల్ల విలువ పెరుగదు సరిగ దా.. స్థాయి తగ్గుతుంది. సమానుల మధ్య మైత్రి ఒకరినొకరు అవగాహన చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఒక సంస్థలోని నాయకుడు మరొక సంస్థలోని నాయకుని సమస్యలను అర్థం చేసుకోగలుగుతాడు. ఆలోచనలు, అవగాహనలో వారిలో ఒకే విధమైన సారుప్యత ఉంటుంది. రెండు శక్తులు ఒకటిగా పనిచేయడం వల్ల ఇద్దరూ ప్రగతి సాధిస్తారు.
లెక్కల్లో ఒకటికి ఒకటి కలిస్తే రెండవుతుంది. ఒకదానితో మరొకదానికి వైరుధ్యం ఏర్పడితే అది ఒకటిగానే మిగిలిపోతుంది. వ్యక్తిగా సాధించలేనిది కొన్నిసార్లు బృందంగా సాధించొచ్చు. ఒ కరి ఆలోచనను మరొకరితో పంచుకుంటే ఆ పరిణామం రెండు ఆలోచనలకు పురుడు పోస్తుంది. ఒకరు సంపదను సాధించవచ్చు కాని.. దానితో సమానస్థా యి వారితో అవసరమైన భాగస్వామ్యం లేకపోతే అతడు ఒంటరి వాడవుతాడు.
తాబేలు, కుందేలు కథ ఏం చెబుతుందంటే..
ఒక అడవిలో తాబేలు, కుందేలు స్నే హంగా ఉండేవి. ఒకనాడు కుందేలు ‘మిత్రమా.. మనలో ఒకరమే నాయకునిగా ఉంటే బాగుంటుంది. కాబట్టి పరుగుపం దెం పెట్టుకుందాం. గెలిచిన వారు నాయకుడు.. ఓడిన వారు అనుచరులుగా ఉండా లి..’ అని తాబేలుతో అన్నది. సరేనంది తా బేలు. అనుకున్నట్లుగానే రెండూ ఓ రోజు పరుగు పందెం నిర్ణయించుకున్నాయి. గుడ్లగూబను న్యాయనిర్ణేతగా నియమించుకున్నాయి.
గుడ్లగూబ నిర్ణీత దూరానికి ఒక గీతను గీసి దానిని ఎవరు ముందుగా దాటితే వారు నాయకుడని ప్రకటించింది. సమ్మతించిన కుందేలు, తాబేలు సమయానికి పోటీకి సన్నద్ధమై వచ్చాయి. పోటీ ఆరంభమైంది. సహజంగానే వేగంగా నడి చే కుందేలు పరుగు లంఘించుకున్నది. కొంత దూరం వెళ్లి వెనక్కి చూడగా తాబే లు తన కనుచూపుమేరలో కనిపించలేదు.
తాబేలు ఎలాగూ నెమ్మదిగా వస్తుందని భావించిన కుందేలు కాసేపు చెట్టునీడన విశ్రమించి వెళ్లవచ్చని భావించి నిద్రకు ఉ పక్రమించింది. ఈ మధ్య కాలంలో తాబే లు నెమ్మదిగా నడుచుకుంటూ గుడ్లగూబ గీసిన లక్ష్యాన్ని అధిగమించింది. దీంతో తాబేలును గుడ్లగూబ నాయకునిగా ప్రకటించింది. నెమ్మదిగా నడిచినా స్థిరత్వాన్ని కలిగి ఉండడం వల్ల తాబేలు విజయాన్ని సాధించింది.
కానీ.. కుందేలు ఆ పని చేయలేక ఓడింది. కుందేలు ఆలోచించింది. తన బలాబలాలను విశ్లేషణ చేసుకున్నది. కానీ.. కుందేలు వేగంగా పరుగెత్తగలను.. అనుకుంటూనే సోమరితనానికి లొంగింది. ప్రతిఫలంగా అపజయాన్ని మూటగట్టుకున్నది. తాబేలు మాత్రం సమయమే వనరు గా భావించింది. సోమరితనాన్ని జయించి మెల్లగా నడిచినా విజయం సాధించింది. కుందేలు తర్వాత ఏడాది పాటు సాధన చేసింది.
సంవత్సరం గడిచాక కుందేలు ‘మిత్రమా.. సంవత్సరం గడిచింది.. మరోసారి పరుగు పందెం పెట్టుకుందాం. పోటీ లో గెలుపొందిన వారు సంవత్సరకాలం నాయకులుగా ఉంటారు’ అని తాబేలును కోరింది. అందుకు తాబేలు సరేనంది. రెండూ మళ్లీ గుడ్లగూబనే న్యాయనిర్ణేతగా పెట్టుకున్నాయి. ఓ ఉదయం పోటీ ఆరంభమైంది. కుందేలు ఒక్క ఉదుటన పరుగుపెట్టి లక్ష్యాన్ని అధిగమించింది.
పరాజయం తర్వాత తాబేలు విశ్లేషణ..
పరాజయం తర్వాత తాబేలు తనకు తా ను విశ్లేషణ చేసుకున్నది. సృజనాత్మకంగా ఆలోచించింది. కుందేలు తన బలహీనతను అధిగమించింది. కాబట్టి తాను గెలి చింది. తాను కూడా బలహీనతను అధిగమించాలి. వేగంతో కుందేలును గెలవడం సాధ్యపడదు. అలాగని ఓడిపోవడమూ అంగీకారం కాదు. తన సమర్థతను ఉన్నతీకరించుకోవడమే విజయానికి దారి అ నుకున్నది.
ఆ మార్గంలో పరిశ్రమించింది. సంవత్సరకాలం కుందేలూ తన పరిశ్రమ ను ఆపలేదు. కాలావధి తర్వాత కుందేలు తో మరో పోటీకి సిద్ధమైంది. మళ్లీ గుడ్లగూ బే న్యాయనిర్ణేత. అప్పుడు తాబేలు ‘మిత్ర మా.. పాత దారిలో నడిస్తే పాత ఫలితాలనే సాధిస్తాం. కొత్త మార్గాలను అన్వేషిస్తే నే ఉత్తమ ఫలితాలను సాధిస్తాం. కాబట్టి మరొక మార్గంలో పరుగెత్తుదాం’ అని కుందేలుతో అన్నది.
అందుకు కుందేలు కూడా సమ్మతించింది. గుడ్లగూబ పాతదానికి వ్యతిరేక మార్గంలో గీతను గీసింది. తా బేలు, కుందేలు పరుగు ఆరంభించాయి. కుందేలు విజయాన్ని సాధిస్తాననే ఆత్మవిశ్వాసంతో, చాలా వేగంగా పరుగెత్తుతున్న ది. కొంతదూరం వెళ్లగానే కుందేలుకు నది ప్రవాహం ఎదురైంది. తాబేలు నెమ్మదిగా వచ్చినా, సునాయాసంగా నది దాటి ముందుకు వెళ్లి గమ్యస్థానాన్ని అధిగమించింది. తద్వారా విజయం సాధించింది. గుడ్లగూబ తాబేలును నాయకునిగా ప్రకటించింది.
ఒకరికొకరు సహకరించుకుంటేనే అభ్యుదయం..
రెండోసారి పోటీ తర్వాత కుందేలు , తా బేలు వచ్చే ఏడాదిలో పాల్గొనేందుకు మ రోసారి సిద్ధమవుతున్నాయి. రెండూ గతం లో రెండుసార్లు పాల్గొన్న పరుగు పందేల ను విశ్లేషించుకున్నాయి. తామిద్దరూ తప్పు డు మార్గంలో నడుస్తున్నట్లు వాటికి అవగతమైంది. సంవత్సరం గడిచింది. రెండూ మరో పోటీకి సిద్ధమయ్యాయి. గుడ్లగూబ మళ్లీ న్యాయనిర్ణేతగా వచ్చింది. ఓ చోట గెలుపు గీత గీసివచ్చింది.
తాబేలు అప్పుడు కుందేలుపై కూర్చున్నది. కుందేలు వేగంగా పరుగెత్తింది. నది ఒడ్డుకు చేరింది. తాబేలు దిగి కుందేలును తన వీపుపై ఎక్కించుకొని నదిని దాటింది. తిరిగి కుందేలు వీపుపై తా బేలు చేరింది. కుందేలు గీతను దాటింది. గుడ్లగూబ ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ ఇద్దరినీ విజేత లుగా ప్రకటించింది. కుందేలు, తాబేలు తమ ప్రయాణాన్ని విశ్లేషించుకున్నాయి.
ఇప్పటివరకు ఒకరినొక రం గెలవాలని భా వించడం వల్ల ఇద్దరమూ మన శక్తి సామర్థ్యాలను ఉన్నతీక రించుకున్నా, మన ప్రతిభావికాసాలు పరిమితంగానే ఉండిపోయాయి. ఒకరికొకరం సహకరించుకోవడం వల్ల ఇద్దరి ప్రభావశీలత పెరిగింది. నిజానికి కుందేలు తాబేలు కాలేదు.. తాబేలు కుందేలు కాలేదు. దేని ప్రతిభాపాటవాలు వాటివే. రెంటినీ కలిపి తే అభ్యుదయం ప్రకటితమవుతుంది.
అభ్యుదయం ఇద్దరి ప్రగతికీ సుగతికీ మార్గం చూపుతుంది. అందువల్ల సమానస్థాయి కలిగినవారు కలహించుకోకుండా.. సహకారం, సమన్వయత, భాగస్వామ్యం ప్రాతి పదికగా ముందుకు సాగితే వారి వ్యక్తిగత ప్రతిభావ్యుత్పత్తులు పెరుగుతాయి. ఉత్తమ ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. తద్వారా సంస్థల అధినేతలూ, ఉద్యోగులూ, ప్రయోజనం పొందుతారు. వినియోగదారులకూ ఉత్తమ సేవలు అందుతాయి.
పాలకుర్తి రామమూర్తి






