15 July, 2026 | 12:00 AM

సీఎం రేవంత్ రెడ్డిపై పీఎస్‌లో ఫిర్యాదు

15-07-2026 12:00 AM

షాద్నగర్, జులై 14(విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కొందుర్గ్ పోలీస్ స్టేషన్లో బీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. సీఎం వ్యాఖ్యలు రాజకీయ విద్వేషాలను, ప్రజల్లో ఘర్షణలను రెచ్చగొట్టేలా ఉన్నాయని వారు ఆరోపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు రామకృష్ణ, మణయ్య, బందులాల్, గోపాల్ నాయక్ తదితరులు పోలీసులను డిమాండ్ చేశారు.