15 July, 2026 | 12:41 AM

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం

15-07-2026 12:00 AM

ఎంఈఓ ఖాజా మొయినుద్దీన్                        

జవహర్ నగర్, జూలై 14 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్య నందించడమే తమ లక్ష్యం అని కాప్రా మం డల ఎఫ్‌ఎసి ఎంఈఓ ఆజా మొహినుద్దీన్ అన్నారు. నూతనంగా నియామకమైన కా ప్రా మండల ఎఫ్‌ఎసి ఎంఈఓ ఆజా మోహినిద్దీన్ జవహర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలో మంగళవారం ఉపాధ్యాయుల బృందం కలిసి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాజా మొ యినుద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపితం చేయాలని పదవ తరగతిలో 100% ఉత్తీర్ణతకు కృషి చేయాలని అన్నారు.

పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తోడ్పడతానని విద్యార్థులకు క్రీడలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని చిన్నప్పటినుండే విద్యార్థులు మంచి నడవడికలో నడిచే విధంగా విద్యాబోధన చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.