కాప్రా ఎస్‌ఆర్‌ఓ ఆఫీసుపై ఫిర్యాదు
ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
కుషాయిగూడ జూన్ 15 (విజయక్రాంతి): కాప్రా సబ్ రిజిస్ట్రార్ కార్యా లయంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ సంబంధి త అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్ట రుకు వినతిపత్రం అందజేశారు.
కా ర్యాలయంలో సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్ ప్రజలను ఇబ్బందు లకు గురిచేస్తున్నారని, ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎం.లక్ష్మణ్‌గౌడ్, డి. నాదం, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు రేగొండ వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఇస్లావత్ హరినాయక్, నాయకులు గడ్డల పండు ముదిరాజ్, శ్రీనివాస్ నాయక్, గోపాలకృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.






