డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించండి
- ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న ‘యార్డ్’
- ప్రపంచంలోనే ప్రమాదకరమైన ప్రాంతం జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్
- పంచభూతాల సాక్షిగా పర్యావరణం ఆందోళనకరం
- ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
జవహర్‌నగర్, జూన్, 15 (విజయక్రాం తి): ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించాలని ప్రపంచంలోనే ప్రమాదకరమైన ప్రాంతంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నాలుగో స్థానంలో నిరుస్తుందని పంచభూతాల సాక్షి గా... పర్యావరణానికి ఆందోళన కలిగిస్తున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ ప్రజావాణిలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ డిమాండ్ చేసింది.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ కా ర్యాలయంలో అదనపు కలెక్టర్ విజయేంద్ర రెడ్డికి డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ జేఏసీ చైర్మన్ షేక్షావలి అధ్యక్షతన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కో కన్వీనర్స్ కమిటీ సభ్యులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కో కన్వీనర్స్ మాట్లా డుతూ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలైన జవహర్ న గర్, కాప్రా, యాప్రాల్, కీసర, దమ్మాయిగూ డ, నాగారం, రాంపల్లి, ఘట్కేసర్, అహ్మద్గూడా లాంటి తదితర ప్రాంతాల్లో ప్రకృతి పర్యావరణాన్ని మానవ మానవుల ఇతర జీవరాసుల వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్న డంపిం గ్ యార్డ్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు.
ప్రజల ఆరోగ్య భద్రత మీద డంపింగ్ యార్డ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని గాలి నీరు నేల పూర్తిగా కలుషిత మైపోయాయని ప్రపంచంలోనే ప్రమాదకరమై న ప్రాంతంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నాలుగవ స్థానంలో ఉన్నదని తెలిపారు. పర్యావరణ శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఈ డంపింగ్ యార్డ్ పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని గుర్తు చేశారు. పాలకులకు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టబద్ధమైన ప్రజాస్వామ్యమైన రాజ్యాంగబద్ధమైన పాలనను అందిస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గత ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి బాధిత డంపిం గ్ యార్డ్ ప్రజలను ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేయడానికి వారు తీ వ్రంగా తప్పుపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. మంచినీరు నీరు ఆరోగ్య భద్రతలో భాగంగా జీవించే హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో జరిగే ప్రజా పోరాటాలకు ఆందోళనకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఈ సందర్భంగా హెచ్చరించింది.
ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్ మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు, గడ్డం సదానందం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, సిపిఐ తోటపల్లి శంక,ర్ సిపిఎం టి శివన్నారాయణ, తెలంగాణ జన సమితి భద్రగామి ఆంజనేయులు, జనవిజ్ఞాన వేదిక శ్రీనివాస్, చంద్రమౌళి, జాన్ జనవాని ప్రతాప్, సీఐటీయూ నర్సింగరావు, అల్లూరి సావిత్రి, పెరిక సునీత, ప్రవీణ్ ,మహమ్మద్ రషీ ద్రావిడ, కవి కళాకారుడు మేడ శ్రీను, శ్రవణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల హక్కుల సమితి మోనార్ దుర్గాప్రసాద్, జర్నలిస్టు వేణు, సిహెచ్ మాధవరెడ్డి, రాంపల్లి అశోక్ కుమార్, పి. శేషగిరిరావు, తదితరులు పాల్గొన్నారు.






