ప్రభుత్వ భూమి ఆక్రమణలపై ప్రజావాణిలో ఫిర్యాదు
17-08-2026 07:27 PM
బెజ్జంకి, ఆగస్టు 17: మండల కేంద్రంలోని సర్వే నంబర్ 606లో ఉన్న 23 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త ఉప్పులేటి బాబు మండల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాలు, తహసీల్దార్ నివేదికలు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అక్రమంగా కేటాయించిన ఇంటి నంబర్లను వెంటనే రద్దు చేసి, ల్యాండ్ ఎన్‌క్రోచ్‌మెంట్ యాక్ట్-1905లోని సెక్షన్-6 ప్రకారం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులను కోరారు.






