17 August, 2026 | 4:54 PM

నితిన్ నబిన్ కొత్త టీమ్‌ ఇదే! పురందేశ్వరికి కీలక పదవి

17-08-2026 04:22 PM

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్(BJP National President Nitin Nabin) సోమవారంనాడు BJP పార్టీకి సంబంధించిన కొత్త జాతీయ కార్యవర్గ సభ్యుల బృందాన్ని ప్రకటించారు. వసుంధర రాజే సింధియా, డి. పురందేశ్వరి, తీరథ్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత జై పాండా, సర్దార్ మన్‌ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బి.ఎల్. సంతోష్ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.

అలాగే, వినోద్ తావ్డే, సునీల్ బన్సాల్, స్మృతి ఇరానీ, బిప్లబ్ కుమార్ దేబ్‌లతో సహా ఎనిమిది మందిని జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నబిన్ నబిన్ నియమించారు. పార్టీ తన వివిధ విభాగాలకు (మోర్చాలకు) కొత్త అధిపతులను ప్రకటించింది. ఇందులో యువ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ హేమంగ్ జోషి, మహిళా మోర్చా అధ్యక్షుడిగా రూప్ కుమారి చౌదరి, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బన్సీలాల్ గుర్జర్ ఉన్నారు.  బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కకపోవడం గమనార్హం.