calender_icon.png 22 January, 2026 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓవైసీపై పోలీసులకు ఫిర్యాదు

21-01-2026 12:00:00 AM

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన 

కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి 

ఎల్బీనగర్, జనవరి 20 : 15 నిమిషాలు అనే వ్యాఖ్యను ఉపయోగించి హిందువులను పదేపదే బెదిరిస్తున్న ఎంఐఎం ఎమ్మె ల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై చట్టపరమైన చర్య లు తీసుకోవాలని సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీవాణి మాట్లాడుతూ... మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటీవల జరిగిన బహిరంగ ర్యాలీలో అక్బరుద్దీన్ ఒవైసీ రెచ్చగొట్టే, బెదిరింపు ప్రకటన చేశారని ఆరోపించారు. ఇటువంటి ద్వేషపూరిత ప్రసంగాలు ప్రమాదకరమైనవి, మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది అన్నారు. హిందువులపై ఇటువంటి బెదిరింపులు మళ్లీ మళ్లీ పునరా వృతం కాకుండా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.