calender_icon.png 22 January, 2026 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే రిలే నిరాహార దీక్ష

21-01-2026 12:00:00 AM

దీక్షకు మద్దతు తెలిపిన జంపన ప్రతాప్

సికింద్రాబాద్ జనవరి 20 (విజయ క్రాంతి): కంటోన్మెంట్ ఎమ్మెల్యే కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కంటోన్మెంట్ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే జిహెచ్‌ఎంసిలో విలీనం చేయాలని స్థానిక ఎమ్మెల్యే అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ని జిహెచ్‌ఎంసిలో విలీనం చేయాలని, డిమాం డ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే  రిలే నిరాహార దీక్ష. కంటోన్మెంట్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఇప్పటికైనా విలీన ప్రక్రియను మొదలు పెట్టాలని తెలియజేశారు.

గత కొన్ని సంవత్సరాలగా ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ప్రభు త్వం అప్రజాస్వామికంగా చేస్తుందని అన్నా రు. కంటోన్మెంట్ బోర్డు ను జీహెచ్ ఎంసి లో విలీనం చేయాలనీ కంటోన్మెంట్ ఎమ్మె ల్యే కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష  కు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ దీక్ష శిబిరాన్ని సందర్శించి దీక్షలో ఉన్న ఎమ్మెల్యే కు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కె ట్ చైర్మన్ ఆనంద్ బాబు,కరణసింగ్,రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.