8 April, 2026 | 11:13 PM

పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు

08-04-2026 09:05 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): ఎంఐఎం పార్టీ పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తూ, ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, నాయకులను ఉద్దేశించి అసత్యాలతో కూడిన అసభ్య పదజాలంతో, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా వీడియోలను రూపొందించి, లేనిపోని అభూతాకల్పనలు సృష్టించి, సుమారు15మందికి పైగా వ్యక్తులు ముఠాగా ఏర్పడి  దుష్ప్రచారానికి తెర లేపుతున్నారని ఆరోపిస్తు, బుధవారం ఎంఐఎం పార్టీ మహిళా నాయకురాళ్లు, కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలంను కలిసి, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈసందర్భంగా మాజీ కార్పొరేటర్ రాఫియ సుల్తాన మాట్లాడుతూ ప్రస్తుతం తాము ఫిర్యాదు చేసిన వ్యక్తులను, ముందు వరుసలో పెట్టి, ఇతర పార్టీలకు చెందిన కొందరు బడా నాయకులు, ఓప్రజాప్రతినిధి ఉన్నారని, ఇలాంటి నీచపు పనులకు పాల్పడుతూ, దిగజారుడు రాజకీయాలు చేస్తున్న  వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ కు విజ్ఞప్తి చేశమని అన్నారు. ఈకార్యక్రమంలో 60వ డివిజన్ కార్పొరేటర్ నసీం సుల్తాన, మాజీ కోఆప్షన్ సభ్యురాళ్లు రాఫియా సుల్తాన, ముంతాజ్ బేగం, ఇటీవలే పోటీచేసిన అభ్యర్థులు అయేషా ఫాతిమా, కొమ్ముల రామేశ్వరీ, అన్నేమల్ల అనూష, మాజీ కార్పొరేటర్ లింగంపల్లి సుజాత, తజిన్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.