ఏపీఎంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
రంగారెడ్డి, జూన్ 18 (విజయక్రాంతి): షాద్‌నగర్ నియోజకవర్గం చౌదరిగూడం మండలంలోని మండల మహిళా సమాఖ్య కేంద్రంలో ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న రామస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరు తూ మంగళవారం మౌనిక, నస్రీన్ బేగం అనే మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్‌తో పాటు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా మహిళా సమాఖ్య కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తమను ఏపీఎం రామస్వామి లైంగికంగా వేధించడంతో పాటు అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాగా, ఏపీఎం రామస్వా మి సైతం తనపై కుట్రతోనే కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ రిపోర్టర్ సత్యనారాయణ గౌడ్, బుగ్గరాజు, వీవోఏల యూనియన్ నాయకుడు మైనోద్దిన్, శంకర్ అనే వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనంటే గిట్టని వారంతా మహిళలతో ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.






