30 July, 2026 | 6:20 AM

ప్రభుత్వ బడుల్లో మెరుగైన సౌకర్యాలు

19-06-2024 12:05 AM

రామచంద్రాపురం/పటాన్‌చెరు, జూన్ 18: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఎమ్మె ల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే నిధులతో రామచంద్రాపురంలో నిర్మిస్తు న్న పాఠశాల అదనపు గదులను, కమ్యూనిటీ భవనాల పనులను స్థానిక కార్పొరేటర్ పుష్పతో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో నియోజక వర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామన్నా రు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, అంజయ్య, ఆదర్శరెడ్డి, పరమేశ్, ఐలేష్ యాదవ్, బల్ల నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

ఆలయాల అభివృద్ధికి సహకారం..

నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఘనాపూర్‌లో మంగళవారం రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోతవం నిర్వహించగా,  ఎమ్మె ల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కాశిరెడ్డి పాల్గొన్నారు.