25 February, 2026 | 3:08 AM

వేధింపులపై ఫిర్యాదు చేయాలి

25-02-2026 12:21 AM
  1. మహిళలకు షీటీమ్ అండగా ఉంటుంది 
  2. మల్కాజిగిరి షీటీమ్ డీసీపీ ఉషారాణి 

ఎల్బీనగర్, ఫిబ్రవరి 24 : వేధింపులపై మహిళలు, యువతులు, బాలికలు ధైర్యంగా షీటీమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని, మహిళలు, బాలికలపై హింసను సహించేది లేదని షీటీమ్ డీసీపీ ఉషారాణి అన్నారు. ఎల్బీనగర్లోని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ క్యాంప్ ఆఫీస్లో మంగళవారం ఈవ్ టీజర్లకు కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించారు.  ఈ సందర్భంగా డీసీపీ ఉషారాణి మాట్లాడుతూ... మల్కాజిగిరి కమిషనరేట్లో బాలిక లు, మహిళలను వేధిస్తే పోలీసులు వదిలిపెట్టరని, భయం లేకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు.

బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, పాఠశాలలు, కళాశాలలు, కూరగాయల మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో షీ టీమ్స్ పోలీసులు సాధారణ దుస్తుల్లో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. వేధించే వ్యక్తులను సరైన ఆధారాలతో పట్టుకుని, కేసులు నమోదు చేసి, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామని పేర్కొన్నా రు.  కార్యక్రమంలో షీ టీమ్స్ ఏసీపీ పి.వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు ఎం.ముని, జి.అంజయ్య, అడ్మిన్ ఎస్త్స్ర రాజు, షీ టీమ్ సిబ్బంది, కౌన్సెలర్లు పాల్గొన్నారు.