25 February, 2026 | 2:01 AM

మా పెండింగ్ బిల్లులను విడుదల చేయండి

25-02-2026 12:22 AM

పంచాయతీరాజ్ కార్యదర్శికి మాజీ సర్పంచ్‌ల జేఏసీ వినతి  

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : గ్రామాల అభివృద్ది కోసం ఖర్చు చేసిన తమ పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించి తమను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయలని మాజీ సర్పంచ్‌ల జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి దివ్యను మంగళవారం మాజీ సర్పంచ్‌ల జేఏసీ చైర్మన్ సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షులు గుంటి మధుసుదన్‌రెడ్డి నేతృత్వంలో మాజీ సర్పంచ్‌లు కలిసి వినతిపత్రం అందజేశారు.

కేంద్రం నుంచి గ్రామాల అభివృద్ధి కోసం విడతల వారిగా పెండింగ్ నిధులు విడుదల అవతున్నందున.. తాము ఖర్చు చేసిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. తమ సమస్యలపై పంచాయతీరాజ్ కార్యదర్శి సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బిల్లులు విడుదలయ్యేలా చూస్తానని చెప్పారని మాజీ సర్పంచ్‌లు తెలిపారు.