27 August, 2026 | 10:24 AM

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

20-06-2026 05:42 PM

సుల్తానాబాద్ జడ్జి దుర్గం గణేశ్ 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు, అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకొని శనివారం మండల న్యాయ సేవ అధికార సంస్థ, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి  స్థానిక కోర్టు ఆవరణలో పట్టణానికి చెందిన యోగా మాష్టర్ యెల్లే మల్లేశం వివిధ యోగ ఆసనాలు నేర్పించి వ్యాయామం చేయించారు.

ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా శరీరం లోని అన్ని అవయవాలకు వ్యాయామం జరుగుతుందని, ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. యోగా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని, ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా మాష్టర్ ఎల్లె మల్లేశం ను శాలువాలతో ఘనంగా సత్కరించారు.