నెన్నెలలో రైస్ మిల్లు తనిఖీ
27-08-2026 05:22 PM
బెల్లంపల్లి,( విజయ క్రాంతి): నెన్నెల మండలం నందులపల్లిలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లును పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తనిఖీ చేశారు. ప్రజావాణిలో నెన్నెల గ్రామస్తులు శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్, నందులపల్లి మిల్లులో రూ. 4.79 కోట్ల అవినీతి జరిగిందని అవినీతిపరులపై కేసు నమోదు చేసి రికవరీ చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లు తనిఖీ చేశారు. కలెక్టర్ రిపోర్ట్ సమర్పిస్తామని పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు. సదరు రైస్ మిల్లు ఎగవేత చేసిన వ్యక్తి నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడని సమాచారం






