27 August, 2026 | 8:53 AM

లోక్ అదాలత్ లతో సమన్యాయం: జడ్జి దుర్గం గణేశ్

20-06-2026 05:45 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): లోక్ అదాలత్ లతో ఇరు వర్గాలకు సమ న్యాయం అందుతుందని జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ లోక్ అదాలత్ లలో ఇరు పక్షాల అంగీకారంతో రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు.