పెండింగ్ పనులు పూర్తి చేయండి
మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి
పటాన్ చెరు, మార్చి 13పటాన్చెరు ని యోజకవర్గం పరిధిలోని భారతినగర్ డివిజన్లో పెండింగ్లో ఉన్న అండర్ డ్రైనేజ్ పైప్లైన్ పనులపై మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి శుక్రవారం హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా భారతినగర్ డివిజన్లోని ఫెన్సింగ్ ఏరియా, ఎంఐజీ కాలనీ ప్రాంతాల్లో అండర్ డ్రైనేజ్ పైప్లైన్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు.
పెండింగ్లో ఉ న్న ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్ర జలకు ఉపశమనం కల్పించాలని వారు కో రారు. దీనిపై స్పందించిన హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్బీ ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికా రులతో మాట్లాడి పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు.




