14 March, 2026 | 1:43 AM

సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన

14-03-2026 12:35 AM

నంగునూరు, మార్చి 13:నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నీ ఈ నెల 22 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం సిద్దిపేట అదనపు డీసీపీ సిహెచ్ కుశాల్కర్ ఏర్పాట్లను   క్షేత్రస్థాయిలో పరిశీలించారు.స భ ప్రాంగణం,హెలిప్యాడ్, రైతు మేళా వేదిక, పార్కింగ్ స్థలాలను పరిశీలించి ,

భద్రత ఏర్పాట్లు పడ్కడబంధిగా ఉండాలని అధికారులను ఆదేశించారు.ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూ చించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఆయన వెంట ఎసిపి రవీందర్ రెడ్డి, సిఐ శ్రీను, ఉన్నారు.