5 August, 2026 | 7:50 PM

ఉపాధ్యాయ అభ్యర్థులకు సమగ్ర మార్గదర్శిగా నిలుస్తాయి

05-08-2026 06:58 PM

భైంసా,(విజయక్రాంతి): టెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉపయోగపడేలా స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ (ఎస్‌టీయూటీఎస్) ఆధ్వర్యంలో రూపొందించిన టెట్ అధ్యయన సామగ్రిని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ దర్శనం భోజన్న బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యమైన అధ్యయన సామగ్రిని అత్యంత తక్కువ ధరలో ఉపాధ్యాయ అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు.

ఉపాధ్యాయ సంఘాలు తమ హక్కుల సాధనతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల అభివృద్ధికి దోహదపడే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. టెట్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అధ్యయన సామగ్రిని సద్వినియోగం చేసుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

జిల్లా అధ్యక్షులు భూమన్న యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్, ఆర్థిక కార్యదర్శి బి. వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చొక్కారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగభూషణ్, రాజమహేందర్, శ్రీనివాస్, మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మఠం పరమేశ్వర్, లక్ష్మీనారాయణ, ఖలీద్ హైమాద్, నాగోరావు, ఎం. చంద్రశేఖర్ రావు, మధుసూదన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.