27 July, 2026 | 1:31 AM

బాలికలకు భద్రత ఏదీ..?

27-07-2026 12:32 AM

కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయరా..? 

కాంపౌండ్ వాల్ లేక విద్యార్థినుల ఇబ్బందులు 

భద్రతకు బదులు నిర్లక్ష్యం.. 

ప్రహరీ కోసం ఎదురుచూపులు

స్కూల్ పరిసరాల్లో ఆకతాయిల హల్చల్‌తో ఆందోళన

కారేపల్లి, జూలై 26 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో కాంపౌం డ్ వాల్ లేకపోవడంతో విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రహరీ గోడ లేకపోవడంతో పాఠశాల ఆవరణలోకి బయటి వ్యక్తులు, పందులు, గొర్రెలు లోనికి సులభంగా ప్రవేశించే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బాలికలు భద్రత విషయంలో భయాందోళనలకు గురవుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఆకతాయిల సంచారం పెరుగుతుండటంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాం పౌండ్ వాల్ నిర్మించాలని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు చ ర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంట నే పాఠశాలకు బలమైన కాంపౌండ్ వాల్ ని ర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరుతున్నారు.

స్కూల్ పరిసరాల్లో ఆకతాయిల హల్‌చల్‌తో ఆందోళన..

సింగరేణి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ప్రాంగణంలో కాంపౌండ్ వాల్ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు ఇష్టానుసారంగా సంచరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాల విరామ సమయంలో విద్యార్థినులు ఆడుకుంటున్న వేళ, అలాగే ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న సమయంలో కొందరు యువకులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి అసభ్యం గా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు మద్యం సే విస్తూ పాఠశాల పరిసరాల్లో తిరుగుతున్నార ని, వారిని ప్రశ్నిస్తే గొడవలకు దిగుతూ ప ట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థినులు భయాందోళనలకు గురవుతున్నారని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. పాఠశాల చుట్టూ వెంటనే బలమైన కాంపౌండ్ వాల్ నిర్మించి, పోలీసు నిఘా పెంచడంతో పాటు ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.