పదోన్నతులు కల్పించాలని ఆందోళన
23-06-2024 01:19 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి): పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ లాంగ్వేజీ పండిట్లు, పీఈటీలు హైదరాబాద్ లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు భారీగా పదోన్నతులు కల్పించా రని చెప్పారు. లాంగ్వేజీ పండిట్లు, పీఈటీలను అప్‌గ్రేడ్ చేస్తూ ఎటువంటి నిబంధనలు లేకుండా పదోన్న తులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరా రు. రూల్ రిజర్వేషన్ అమలు చేయకుండా అందరికీ పదోన్నతులు కల్పిం చాలని డిమాండ్ చేశారు.






