8 May, 2026 | 1:40 PM

రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు

23-06-2024 01:18 AM

ఎమ్మెల్యే పల్లా

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలకు తెరలెపారని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నా రు. అమెరికాలోని వర్జీనియాలో శనివారం నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఇలాంటి వాతా వరణం రాష్ట్రపౌరులు ఎప్పుడూ చూడలేదన్నారు. తాను చివరి వరకు బీఆర్‌ఎస్‌తో ప్రయాణం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలు పాటిస్తే బాగుంటుందన్నారు. కానీ కొందరు పార్టీని వీడటం సిగ్గుచేటన్నారు. పార్టీ మారాలని తనపై కొందరు ఒత్తిడి తెస్తు న్నారన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే తనపై నాలుగైదు కేసులు నమోదయ్యాయన్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులపైనా కేసులు బనాయించారన్నారు.