18 July, 2026 | 10:01 PM

నాగ పెళ్లిలో భూ సర్వే పై గ్రామ సభ

18-07-2026 09:28 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని నాగ పెళ్లి గ్రామంలో తహసిల్దార్ పనకంటి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. రెవెన్యూ అధికారులు భూ సర్వే పై ఎంపిక చేసిన గ్రామాల్లోని పట్ట భూములు ప్రభుత్వ భూములు చెరువులు కుంటలతో పాటు అన్ని రకాల భూములను సర్వే చేయనున్నట్లు తాసిల్దార్ తెలిపారు. సర్వేకు గ్రామస్తులు అందరూ సహకరించాలని కోరారు. సర్వే చేయడంతో తగాదాలు లేకుండా భూముల సమస్యలు తీరుతాయని వారు అన్నారు.