18 July, 2026 | 10:47 PM

హైడ్రాకు మద్దతుగా సంఘీభావo

18-07-2026 09:41 PM

నగరంలో భారీ ర్యాలీ

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని అనఘపురి కాలనీ, మేడిపల్లి టెలిఫోన్ కాలనీ సంక్షేమ సంఘం, జయలక్షి కాలనీ సంఘాల ప్రతినిధులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ  హైడ్రాకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కాలనీ వాసులు కోరారు. రెండు సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కబ్జాదారుల చేరనుండి హైడ్రా కాపాడిందని వారు అన్నారు..! పర్యావరణ పరిరక్షణలో హైడ్రా పాత్ర కీలకమని, గ్రేటర్ హైదరాబాదులో కాలుష్యాన్ని తగ్గించడానికి చెరువుల పునరుద్ధరణ కొనసాగాలని.. హైడ్రాను మరింత పటిష్టం చేసి శాశ్వతంగా కొనసాగి చాలని వారు డిమాండ్ చేశారు.