మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి పరామర్శ
09-09-2026 | 05:25am
నిమ్స్‌కు వెళ్లిన మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): ఎర్రవల్లి ఫాంహౌస్ సమీపంలో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి(former MLA Narsa Reddy)ని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తదితరులు మంగళవారం రాత్రి పరామర్శించారు.
ఈ సందర్భంగా నర్సారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు స్పష్టం చేశారు. నర్సారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పార్టీ అండగా ఉంటుందని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.