గీత కార్మికుడికి పరామర్శ
* సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్
కడ్తాల్: మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు జంగయ్య రోజువారీ పనిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవాశత్తు చెట్టుపై నుంచి కింద పడటంతో శరీరానికి బలమైన గాయాలయ్యాయి.గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్గౌడ్, స్థానిక నాయకులు సుమన్, నరసింహ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
జంగయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.గీత కార్మికులు వృత్తి రీత్యా ఎంతో ప్రమాదకరమైన పని చేస్తున్నారు. జంగయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రమాద సమయాల్లో గీత కార్మికులను ఆదుకోవాలని కోరారు.






