15 August, 2026 | 1:50 PM

ఉత్తమ సేవలకు డీ టీకి ప్రభుత్వ ప్రశంస

15-08-2026 01:15 PM

కేసముద్రం (విజయక్రాంతి): విశిష్టమైన సేవలకు  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఉప తహసిల్దార్ ఎర్రయ్య ప్రభుత్వం నుంచి పంద్రాగస్టు సందర్భంగా ప్రశంసలకు ఎంపికయ్యారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, కలెక్టర్ స్నేహ శబరిష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. కేసముద్రం మండల పరిధిలో రెవెన్యూ శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం, ప్రతిష్టాత్మకమైన నారాయణపురం గ్రామ రైతులకు పెండింగ్లో ఉన్న వ్యవసాయ భూములకు పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయడంలో కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వం నుండి ప్రశంస పత్రం అందుకున్న ఎర్రయ్యకు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.