15 August, 2026 | 3:54 PM

పోలీస్ పరేడ్ గ్రౌండ్స 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 01:29 PM

నిజామాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా జరిగిన ఈ వేడుకలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు వందనం చేశారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసు బృందాల కవాతును ఆయన పరిశీలించారు.

అనంతరం పోలీసు వాహనంలో పరేడ్ గ్రౌండ్లో తిరుగుతూ పోలీసు అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబ సభ్యులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు పిలుపునిచ్చారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ, గౌరవ వందనం, పోలీసు బలగాల కవాతు కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి నినాదాలతో పరేడ్ గ్రౌండ్ మార్మోగింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలో పండుగ వాతావరణం నెలకొంది.