15 August, 2026 | 2:06 PM

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివి

15-08-2026 01:28 PM

హుజూర్ నగర్‌ మున్సిపల్ చెర్మన్ దొంతగాని శ్రీనివాస్

హుజూర్ నగర్, ఆగస్టు 15: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివి అని హుజూర్ నగర్‌ మున్సిపల్ చెర్మన్ దొంతగాని శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఆనాడు భారతదేశ స్వాతంత్ర్య కోసం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు.అనంతరం పట్టణంలో 400 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. దేశభక్తిని చాటుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ సతీష్,శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, మున్సిపల్ కౌన్సిలర్లు,పలు ప్రభుత్వ ఉపాధ్యాయులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.