జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
15-08-2026 01:21 PM
నిజామాబాద్,ఆగస్టు 15(విజయక్రాంతి): 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాలనాధికారి భవేష్ మిశ్రా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ వి. భుజంగరావు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, ట్రైనీ ఆర్డీఓ సందీప్, కలెక్టరేట్ ఏఓ బాలరాజు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






