15 August, 2026 | 1:53 PM

గణపురంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 01:23 PM

గణపురం, ఆగస్టు15 (విజయ క్రాంతి): మండల కేంద్రంలో  80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాధిక మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు విద్యతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలు అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.