17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బాధిత కుటుంబాలకు బాసట

15-10-2025 12:52 AM

మంత్రి శ్రీధర్ బాబు 

కాటారం, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంగళవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బాధిత కుటుంబాలను పరామర్శించి, బాసటగా నిలిచారు. కుటుంబాలకు భరోసా కల్పించారు. మండలంలోని ఒడిపిలవంచ గ్రామానికి చెందిన ఇసునం లక్ష్మి ఇటీవల పిడుగు పడి మరణించగా, మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అనంతరం పిడుగు పడి గాయపడిన గుమ్మలపల్లి గ్రామానికి చెందిన వారిని  కలిసి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు.

మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమునూరీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చీమల సందీప్, అధికార ప్రతినిధి కుంభం రమేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఓం సింగ్, అయిత శకుంతల, కుసుమ సమ్మయ్య, చీర్ల తిరుపతిరెడ్డి, వెంకటరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.