15-10-2025 12:51:35 AM
ప్రమాదానికి గురవుతున్న వాహనదారులు
రేగోడు, అక్టోబర్ 14: మండలంలోని పోచారం నుండి గజవాడ చౌరస్తా వరకు రోడ్లు గుంతలు గుంతలుగా పడి ప్రమాదకరంగా మారాయి. ఆ రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాలు పడితే మాత్రం గుంతలలో నీళ్లు ఉండి రహదారుల వెంట వెళ్లాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడాల్సి వస్తుందని వాహనాదారులు వాపోతున్నారు, అదేవిధంగా రేగోడు మర్పల్లి మధ్యలో ఉన్న రోడ్డు మరీ అధ్వానంగా మారింది.
రాత్రి సమయంలో అక్కడి నుండి రావాలంటే భయపడవలసి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ఈ రోడ్లకు మరమ్మత్తులు ఎప్పుడు చేస్తారోనని వాహనదారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుంతలుగా మారిన రోడ్లను బాగా చేయాలని వాహనదారులుకోరుతున్నారు.