calender_icon.png 16 October, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌లో ఎంజేపీ విద్యార్థుల హవా

15-10-2025 12:52:54 AM

  1. 11 మెడల్స్ సాధించిన విద్యార్థులు 

రాష్ట్ర స్థాయికి పోటీలకు ఐదుగురు ఎంపిక 

దౌల్తాబాద్,అక్టోబర్ 14: మండల పరిధిలోని లోని మహాత్మ జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మెదక్,సంగారెడ్డి పట్టణాల్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్ క్రీడల్లో అండర్19,అండర్14 విభాగాలలో గురుకుల కళాశాల,పాఠశాల విద్యార్థులు మొత్తం 11 మెడల్స్ను కైవసం చేసుకున్నారు.

అండర్14 విభాగంలో విష్ణు వర్ధన్,దేవీదాస్,భానుప్రసాద్, గణేష్,గిరీష్ రాష్ట్ర స్థాయి క్రీడలకు అర్హత సాధించగా అండర్19 విభాగంలో భరత్, జశ్వంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ స్వప్న మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుండి రాష్ట్ర స్థాయికి ఎదగడం విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావానికి నిదర్శనం అని అభిప్రాయపడ్డారు.వ్యాయామ ఉపాధ్యాయులు సాయి కృష్ణ,బస్వరాజ్,డాంబు విద్యార్థులను అభినందించారు.