30 March, 2026 | 2:34 AM

గో సంరక్షణపై పక్కా ప్రణాళికతో ప్రభుత్వం

30-03-2026 12:48 AM
  1. సీఎం రేవంత్‌రెడ్డి

సీఎంతో పీపుల్ ఫర్  యానిమల్స్ అధ్యక్షురాలు మేనకాగాంధీ భేటీ

సర్కార్ చర్యలపై సంతృప్తి

హైదరాబాద్, మార్చి 29 (విజయ క్రాంతి): తెలంగాణలో గోవుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళికలు రూపొందించిందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఎన్కేపల్లిలో అత్యాధునిక సౌకర్యా లతో విశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ముఖ్యమైన ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఆదివారం శాసనసభ సమావేశ హాల్‌లో సీఎంతో ప్రముఖ జంతు హక్కుల కార్యకర్త, పీపుల్ ఫర్ యానిమల్స్ అధ్యక్షురాలు మేనకాగాంధీ బృందం భేటీ అయ్యారు. తెలంగాణలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ చర్యలను అధికారులు ఆమెకు వివరించారు. మున్సిపాలిటీల వ్యాప్తంగా వీధి కుక్కలకు నిర్వహిస్తున్న స్టెరిలైజేషన్ ప్రక్రియ వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జంతువుల సంరక్షణ కోసం తీసుకుంటున్న క్షేత్రస్థాయి చర్యలను అధికారులు బృందానికి తెలిపారు. ప్రభుత్వ చర్యలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.