calender_icon.png 22 November, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం..

09-02-2025 08:02:37 PM

కోదాడ (విజయక్రాంతి): ముత్తవరపు లక్ష్మమ్మ, సుబ్బారావుల జ్ఞాపకార్థం ముత్తవరపు పాండు రంగారావు మిత్రమండలి ఆధ్వర్యంలో కాపుగల్లు గ్రామ ప్రజలందరికీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. ఆదివారం కాపుగల్లు గ్రామంలో హైదరాబాద్ కు చెందిన శ్యామ్ హాస్పిటల్ వైద్య బృందం, కోదాడ పట్టణ ప్రముఖ వైద్యుల సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ముత్తవరపు పాండురంగారావు, లక్ష్మీ దంపతులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, డాక్టర్ జాస్తి సుబ్బారావు, రామారావు, ఇఎన్టి ప్రసాద్, శ్యామ్, నవీన్, శ్రీనివాసరావు, రావెళ్ల సీతారామయ్య, పెదనాటి వెంకటేశ్వరరావు, మేకల వెంకట్రావు,బొల్లు రాంబాబు, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, ముత్తవరపు రామారావు, మల్లంపల్లి వెంకటేశ్వరరావు, బాలబోయిన వీరయ్య, వల్లూరి రవి, లక్ష్మయ్య, పాల్గొన్నారు.