09-02-2025 08:05:29 PM
రామాయంపేట (విజయక్రాంతి): రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో 2010-11 పదవ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. విద్యార్థులకు చదువు చెప్పిన అప్పటి ఉపాద్యాయులను విద్యార్థులు సన్మానించారు. పదేళ్ల క్రితం విడిపోయిన విద్యార్థులు తమ పాత జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు. తమలో తామకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఒకరికొకరం అందరం కలిసి సహాయం చేసుకుంటామని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటెశ్వర్ రావు, టీచర్లు సాయి రెడ్డి, పరమేశ్వర్, నాగచందర్, అప్పాజితో పాటు పలువురు టీచర్లను సన్మానించారు.