calender_icon.png 22 November, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలి

09-02-2025 07:59:08 PM

సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16న, తేదీన హైదరాబాద్ ఓంకార్ భవనంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఊక్లా కోరారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి 16 నెలల కాలంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి అమలు చేయలేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తూ అనేకమంది విప్లవకారుల మీద ప్రజా ఉద్యమనాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేయించి, జైలు నిర్బంధాలను మరో ఎమర్జెన్సీని విధించే విధంగా కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుందని అన్నారు.

తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్కటి వాగ్దానం ఇంతవరకు అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 16వ తారీఖున హైదరాబాదు ఓంకార్ భవన్ లో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ, కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్, సబ్ డివిజన్ కమిటీ నాయకులు భూక్యా కిషన్, వీరమల్ల ఉమ, నక్క లావణ్య, బానోత్ రాజేష్, గుర్రం వెంకటేష్, PDSU జిల్లా కార్యదర్శి జె గణేష్ తదితరులు పాల్గొన్నారు.