ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలి: డాక్టర్ సంపత్ కుమార్
సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు
తాండూరు,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుస్తూ శాంతియుత సుఖసంతోష జీవనం గడపాలని ప్రముఖ వైద్యులు, బివిజి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శన ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పవిత్ర పుణ్యక్షేత్రం సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
దర్శనానికి పట్టణ ప్రజలు కాకుండా నియోజకవర్గంలో ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలి రావడంతో జ్యోతిర్లింగ ప్రాంగణం కిటకిటలాడింది. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి దంపతులు, బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ నాగారం మల్లేశం దంపతులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోర్వార్ నాగేష్, తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.




