24 March, 2026 | 4:13 PM

కేసీఆర్, హరీష్ రావుల చిత్రపటాలకు క్షీరాభిషేకం

24-03-2026 03:06 PM

హరీష్ రావు కృషి ఫలితమే గట్లమల్యాల పీహెచ్సీ: బిఆర్ఎస్ నాయకులు

నంగునూరు,(విజయక్రాంతి): నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బీఆర్‌ఎస్వీ గ్రామ శాఖ అధ్యక్షుడు రంగు చింటూ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు దూరదృష్టితో వాగువతల గ్రామాలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో నాడు రూ.1.43 కోట్లతో ఆరు పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయించి పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు.గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కట్టడాలకు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని వారు విమర్శించారు.