విద్యార్థులతో అరైవ్, అలైవ్ ప్రోగ్రాం నిర్వహణ
16-04-2026 12:00 AM
ఘట్ కేసర్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : రాష్ట్ర డీజీపీ, మల్కాజిగిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం యంనంపేట్ లోని రాక్ వుడ్ స్కూల్ విద్యార్థులతో ఎరైవ్, ఎలైవ్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురక్షితంగా రోడ్డు దాటడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, స్కూల్ బస్సులో సురక్షితంగా ఎక్కడం-దిగడం, పాఠశాలల సమీపంలో వేగ నియంత్రణ, అలాగే పిల్లలను తీసుకువెళ్తున్న రైడర్లు హెల్మెట్ ధరించాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించబడింది. అనంతరం రాక్ వుడ్ స్కూల్ విద్యార్థులతో మానవ హారం కార్యక్రమం కూడా నిర్వహించబడింది. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






